సెంట్రల్ బ్లాక్, మొదటి అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / సెంట్రల్ బ్లాక్, మొదటి అంతస్తు / అరేబియన్, పర్షియన్ వ్రాతప్రతులు
అరేబియన్, పర్షియన్ వ్రాతప్రతులు
మ్యూజియంలోని అతి విలువైన వస్తువుల్లో ఇదొకటి. అందమైన దస్తూరితో ఉన్న అనేక గ్రంథాలిక్కడున్నవి. ఇక్కడ వంగపండు రంగుతో ఎండిన తోలుపై అరబిక్నక్ష్ లిపిలో రాసిన ఖురాన్ గ్రంథం, క్రీ.శ.9వ శతాబ్దానికి చెందినది ఉంది. చిత్రాలతో ఉన్న పవిత్ర ఖురాన్లు అనేకం ఇక్కడున్నవి.
మెసపుటేమియస్ నాగరికతకు చెందిన అందమైన నష్క్ విధానంలో ఆలంకారిక దస్తూరి కల ఖురాన్ ప్రతి ఉన్నది. ఇది చివరి అబ్బాసిద్ ఖలీఫా అయిన ముస్తసింబిల్లాహ్ యొక్క ఆస్థాన లేఖకుడు అయిన యాఖుత్ రాసినది. అరుదైన, అపూర్వమైన గ్రంథం. కారణం దీనిపై చక్రవర్తులైన జహంగీర్, షాజహాన్, జౌరంగజేబ్ల సంతకాలున్నాయి.
కాబూల్ రాజైన, తన మామ హకీం మిర్జా తన తండ్రి అక్బర్‌కు బహుమతిగా ఇచ్చాడని ధృవీకరిస్తూ జహంగీర్ చక్రవర్తి సంతకం చేసిన ప్రతి ఇక్కడుంది. ఈ ప్రతిని పద్యాల పుస్తకం (బుక్ ఆఫ్ పోయమ్స్) అని పిలుస్తారు. ఇది ప్రసిద్ధ పర్షియన్ శృంగార కవి హఫీజ్ రచన.
ఖురాన్ పద్యాలతో చోగా, అరేబియా, 9 వ -15 వ శతాబ్దం.