సాధారణ సమాచారం

ప్రాంతం

ఇది మూసీ నదికి దక్షిణతీరంలో ఉంది. దీనికి సమీపంలో హైదరాబాద్‌ పాతనగరంలోని చారిత్రక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒక మైలు పరిధిలో చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్‌, మక్కామసీదు, హైకోర్టు, స్టేట్‌ లైబ్రరీ, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి మొ|| ఉన్నాయి.

మ్యూజియం చేరుకోడానికి

రైలు, రోడ్డు మార్గాల ద్వారా మ్యూజియంను సులువుగా చేరవచ్చు. ముఖ్య రైలు స్టేషన్లయిన కాచిగూడ, నాంపల్లి అతి చేరువలో ఉన్నాయి. నగరంలోని అన్ని ముఖ్య ప్రాంతాలనుండి అఫ్జల్‌గంజ్‌కు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు నడుస్తాయి. ఈ అఫ్జల్‌గంజ్‌ మ్యూజియానికి కూతవేటు దూరంలో ఉంది.


history

మ్యూజియం లోపల

మ్యూజియంలో మూడు భవనాల్లో కలిపి 39 గ్యాలరీలు ఉన్నాయి. అవి 1) సెంట్రల్‌ బ్లాక్‌ 2) ఈస్ట్రన్‌ బ్లాక్‌ (మీర్‌ లాయఖ్‌ అలీ ఖాన్‌ భవన్‌) 3) వెస్ట్రన్‌ బ్లాక్‌ (మీర్‌ తురబ్‌ అలీ ఖాన్‌ భవన్‌) అనే పేర్లతో రెండు అంతస్తుల్లో ఉన్నాయి. సెంట్రల్‌ బ్లాక్‌లో 26 గ్యాలరీలు (క్రింది అంతస్తులో 13, మొదటి అంతస్తులో 13 గ్యాలరీలు) వెస్ట్రన్‌ బ్లాక్‌లో 7 గ్యాలరీలు, ఈస్ట్రన్‌ బ్లాక్‌లో 6 గ్యాలరీలున్నాయి.

మ్యూజియం కార్యకలాపాలు సక్రమంగా సాగడానికి ఎడ్యుకేషన్‌ వింగ్‌, కెమికల్‌ కన్సర్వేషన్‌ లేబరేటరీ, ఫోటో సెక్షన్‌, డిస్‌ప్లే సెక్షన్‌, రిసెప్షన్‌ లతో బాటు సేల్స్‌ కౌంటర్‌ ఉన్నాయి. రక్షణ బాధ్యత సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌వారిది (సిఐఎస్‌ఎఫ్‌).

సందర్శకుల కొరకు సదుపాయాలు

ముఖ్యమైన ప్రదేశాలలో కూర్చునే ఏర్పాట్లున్నవి. అవసరానికై రెస్ట్‌రూములు, వీల్‌ ఛెయిర్‌ అందుబాటులో కలవు.

అన్ని ప్రధాన ప్రదేశాలలో వస్తువులు భద్రపరచుకోవడానికి, రెస్ట్‌రూములు మరియు కెఫెటేరియాలు తెలంగాణా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నవి.

ప్రచురణలు

స్కాలర్లు, పరిశోధక విద్యార్థుల ఉపయోగార్థం మ్యూజియం అపురూప కళాకృతుల గురించి కేటలాగులను ప్రచురిస్తున్నది. ఇంతవరకు పర్షియన్‌, అరబిక్‌, ఉర్దు వ్రాతప్రతుల కేటలాగులు ప్రచురితమైనవి. పరిశోధక విద్యార్థుల కోసం సాలార్‌జంగ్‌ మ్యూజియం ద్వైవార్షిక పరిశోధన సంచికను, ప్రత్యేక మోనోగ్రాఫులను ప్రచురించింది.

సెంట్రల్‌ బ్లాక్‌లోని క్రింది అంతస్తులో హెచ్‌.హెచ్‌.ఇ.సి. సావనీరు షాపులో పిక్చర్‌ పోస్ట్‌కార్డులు, కరపత్రాలు, మ్యూజియం ప్రచురణలు సరసమైన ధరలకు దొరుకుతాయి.

history

ఔత్సాహికులకు సౌకర్యాలు

మ్యూజియంలో వివిధ విషయాలకు సంబంధించి అసంఖ్యాకమైన ముద్రిత పుస్తకాలున్నాయి. కొన్ని వేల పర్షియన్‌, అరబిక్‌, ఉర్దూ వ్రాతప్రతులున్నాయి. జిజ్ఞాసువులు రిసెప్షన్‌ కౌంటర్‌లో తగు వివరాలను నమోదు చేయించి, పాసు తీసుకొని లైబ్రరీని ఉపయోగించుకోవచ్చును.