భవిష్యత్ప్రణాళిక

లక్ష్యం

హైదరాబాద్‌ నగరవాసులకు, సందర్శకులకు ప్రపంచంలోని గొప్ప మ్యూజియాలలో ఒకదాన్ని చూసామన్న సంతృప్తిని కలిగించుట.

ఉద్దేశ్యం

మూడవ సాలార్‌జంగ్‌ సేకరించిన కళాసంపద యొక్క పరిరక్షణ, ప్రదర్శనల ద్వారా ప్రపంచ ప్రజల ప్రశంసలు పొందుట. ప్రదర్శనలు, కార్యక్రమాలు, ప్రచురణలు, మీడియా మొదలగు మార్గాల ద్వారా ఈ ఉద్దేశ్యాన్ని సాధించుట. భారత్‌, ఇతర దేశాల కళా, సాంస్కృతిక, చారిత్రక సంపదను సందర్శకులకు పరిచయం చేయుట ద్వారా మరచిపోలేని అనుభవాన్ని అందించుట.