మ్యూజియానికి దారి

మ్యూజియానికి వెళ్ళడానికి రైలు, రోడ్డు మార్గాలున్నవి. హైదరాబాదులో ముఖ్య రైల్వే స్టేషన్లయిన కాచిగూడ, నాంపల్లి 5 కి.మీ. లోపు దూరంలోనే ఉన్నవి. టిఎస్‌ఆర్‌టిసి వారు నగరంలోని అన్ని ప్రాంతాల నుండి అఫ్జల్‌గంజ్‌ వరకు బస్సులు నడుపుతున్నారు. అక్కడనుండి మ్యూజియం చాలా దగ్గర. నడిచి వెళ్ళవచ్చును.

  మ్యూజియం చేరుటకు సిటీ బస్సుల వివరాలు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ :
బస్సులో అఫ్జల్‌ గంజ్‌ వెళ్ళడానికి బస్సు నెం. 1, 1సి, 1జె, 1పి, 2, 2సి, 2జె, 2యు, 2వి, 2జడ్‌, 7జడ్‌, 8ఏ, 8సి, 8ఎం. అఫ్జల్‌ గంజ్‌ నుంచి నడక దూరంలో మ్యూజియం కలదు.
నాంపల్లి రైల్వే స్టేషన్‌ :
అఫ్జల్‌ గంజ్‌ చేరడానికి బస్సు నెం. 8ఎం, 8ఆర్‌, 8యూ, 9, 9డి, 9ఇ, 9ఎఫ్‌, 9కె, 9సి, 9ఎం, 9క్యూ, 9ఆర్‌, 9ఎక్స్‌, 9వై /ఎఫ్‌, 65, 65ఎం మరియు 65ఎస్‌. అఫ్జల్‌ గంజ్‌ నుంచి తేలిగ్గా నడచి వెళ్లొచ్చు.
మహాత్మా గాంధీ బస్‌ స్టేషన్‌ :
ఇక్కణ్ణించి కొద్ది దూరంలోనే మ్యూజియం ఉంది
జూబ్లి బస్‌ స్టేషన్‌ :
8ఆర్‌ బస్సులో అఫ్జల్‌ గంజ్‌ చేరుకొని అక్కణ్ణించి నడచి మ్యూజియం చేరుకోవచ్చును.