ఫార్ ఈస్ట్రన్ ఉడ్ కార్వింగులు
ఈ విభాగంలో 17 నుండి 20వ శ|| చెందిన దారుశిల్పాలు అనేకమున్నవి. చెక్కశిల్పాలు, ఫర్నీచర్, లక్కపూత ఉన్న చెక్కవస్తువులనేకం ఉన్నాయి.
ఈ ఉడ్ కార్వింగ్ అనే కళ చిన్న వస్తువులపై అలంకరణగా ప్రారంభమై నిలువెత్తు శిల్పాలుగా వృద్ధి చెంది, విభిన్న ఆకృతులతో, వైవిధ్యభరితంగా గృహాలంకార వస్తువులుగా రూపాంతరం చెంది మహావృక్షంలా విస్తరించింది. దృఢత్వం, నాణ్యత ఆధారంగా చెక్కను పలు విధాలుగా ఉపయోగిస్తారు. బాక్స్ ఉడ్, పైన్, పియర్, వాల్నట్, విల్లో, ఓక్, ఎబొని మొదలైన రకాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిపై చెక్కడానికి వాడే పరికరాలు తేలికనై ఉలి, శాణము, కొయ్యగూటాలు, మొనదేలిన ఉలులు మొదలైనవి. చెక్కపై చెక్కడం అనేది ప్రపంచంలోనే అతి ప్రాచీనకళ అయినా, కాలానికీ, వాతావరణ మార్పులకీ తట్టుకొని ఎదిగింది.
చైనీయుల శిల్పశాస్త్రంలో ఈ ఉడ్ కార్వింగ్ చాలా ముఖ్యమైనది. ఇది చైనీయుల సాంప్రదాయ కళ మాత్రమే కాదు, సంస్కృతిలో విడదీయలేని భాగం కూడా. ఈ కళ మింగ్ యుగం నుండి, ఖింగ్ కాలం వరకు కొనసాగింది. ఇది విశాల ప్రాసాదాలు, దేవాలయాలు, ధనిక, వర్తక నివాస గృహాలలోనూ కనిపిస్తుంది. క్రమంగా ఇది రెండు దారులుగా చీలింది. ఒకటి మింగ్ శైలిని అనుకరిస్తే, రెండోది ఆధునిక ఫర్నీచర్ తయారీగా రూపు మార్చుకుంది. గంభీరత, సజీవత్వం కారణాలుగా ప్రపంచమంతా ఈ మింగ్ శైలి ఫర్నీచర్‌ను ఇష్టపడతారు.
జపాన్‌లో చైనా రకం చెక్కపని ఎక్కువగా కనిపిస్తుంది. జపాన్ శిల్పి మొదట ఆకులు, పళ్ళు, పూలను చెక్కి, తర్వాత తొడిమె కోసం ఆలోచిస్తాడని అంటారు. ఈ పద్ధతిలో పక్షులు, పురుగులను చాలా శ్రద్ధతో, నైపుణ్యంతో మనకు పరిచయం చేస్తాడు.
ఫార్ ఈస్ట్రన్ దేశాల శిల్ప హస్త నైపుణ్యం అసమానమైనది. ఇక్కడ ఊహాత్మక వస్తువులు నిజమా అనే భ్రమను కలిగిస్తాయి. చాలా దేశాలలో కంటే జపాన్‌లో కళ అనేది మరో లోకానికి తీసికెళ్తుంది. ముఖ్యంగా శిల్పి తామరలు, లిల్లీలు, ఇతర నీటి పుష్పాలను చెక్కినపుడు ఇదే నిజం అనిపిస్తుంది.

చెక్క కుర్చీ, చైనా, క్వింగ్ రాజవంశం, 17 వ-ప్రారంభ 20 వ శతాబ్దం.

చెక్క కుర్చీ, క్వింగ్ రాజవంశం, 17 వ-ప్రారంభ 20 వ శతాబ్దం.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)