సెంట్రల్ బ్లాక్, మొదటి అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / సెంట్రల్ బ్లాక్, మొదటి అంతస్తు / తివాసీ విభాగము

గుర్రపు వెనుక ఖుస్రావును చిత్రీకరించే
పెర్షియన్ కార్పెట్ మరియు షిరిన్
20 వ శతాబ్దంలో టెర్రస్ మీద కూర్చున్నాడు.
తివాసీ విభాగము
ప్రపంచంలోనే పర్షియా తివాసీలకు ప్రసిద్ధి. అక్కడ సఫావిద్ వంశ పాలనలో 16వ శ|| తివాసీ తయారీ ఉచ్ఛదశకు చేరింది. ఇదంతా షా అబ్బాస్ కాలంలో (1568-1628) జరిగింది. ఆయన మరణించాక ఈ కళ ప్రాముఖ్యతను కోల్పోయి క్షీణదశకు చేరింది. క్రీ.శ.1721లో జరిగిన ఆఫ్ఘనుల దాడి నుండి 19వ శ|| వరకూ పర్షియా కోలుకోలేదు.
మ్యూజియంలోని వస్తు సేకరణలో పర్షియన్ తివాసీలది ఒక ప్రత్యేక స్థానం. ఇవి నేలపై పరవడానికి, తలుపులు, గోడలపై వేలాడదీయడానికి, అలంకరణ సాధనంగా పలు రకాలుగా ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగించినా వాటి అందానికి, నాణ్యతకు లోటు లేదు. సున్నితమైన నేత, వైవిధ్యభరితమైన డిజైన్లు, కళ్ళను ఆకట్టుకునే రంగులు ఇవన్నీ పర్షియన్ తివాసీల ప్రత్యేకతలు. షాన్ బొకారా, తబ్రిజ్, కిర్మాన్, ఫిరాజ్ తివాసీలు కొన్ని ప్రముఖ రకాలు.
ఈ మ్యూజియంలో 18వ శతాబ్దానికి చెందిన టర్కొమాన్ ఆదివాసీలు నేసిన బొఖారా తివాసీలున్నాయి. ఇవి కొన్నే ఉన్నా అపూర్వమైన నేతకు మంచి ఉదాహరణలు. వీటిలో డైమండ్ ఆకారాల వరుసలుండి, వాటి మధ్య అష్టకోణాకృతులున్నాయి. ఇవన్నీ మధ్యలో ఉన్న అష్టకోణాకృతితో కలిపి ఉన్నాయి. ప్రతి అష్ట కోణాకృతి మధ్యలో 8 కోణాలతో నక్షత్రాలున్నాయి.
ముఖచిత్రాలతో నేసిన తివాసీలలో ఒకదాంట్లో గుర్రమెక్కి కూర్చున్న ఖుస్రూ, బాల్కనీలో శిరీస్లతో బాటు, నీటిలో ఈదే బాతులూ, చేపలు కార్పెట్ మధ్య భాగంలో, బార్డర్గా చుట్టూతా షికార్ ఘర్ దృశ్యాలున్నాయి.
ఇరాన్లో 16వ శ||లోనే ప్రార్థనకు వాడే శ్రేష్ఠమైన రగ్గులు, ప్రత్యేకమైన డిజైన్లతో నేసేవారు. మ్యూజియంలో ఇలాంటి తివాసీలున్నాయి. పర్షియన్లు తివాసీ నేతలో లోహంతో నేసిన దారాలను కూడా వాడారు. అలాంటి ఒక కషాన్ రకం తివాసీ ఇక్కడుంది. దీని అంచులు చాలా సన్ననైన బంగారుదారంతో పడుగుపేకగా అల్లారు.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)