వెస్ట్రన్ బ్లాక్, క్రింది అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / వెస్ట్రన్ బ్లాక్, క్రింది అంతస్తు / యూరోపియన్ కంచు విభాగం
యూరోపియన్ కంచు విభాగం
యూరప్‌లోని సుదూర ప్రాంతాలలో రాగి, తగరాల మిశ్రమ పదార్థాన్ని వాడేవారు. ఈ మిశ్రమంతో చాలా పదార్థాల్ని చేసేవారు. ముఖ్యంగా విగ్రహాలను. ఈ కళ క్రీ.పూ.6వ శ|| నుంచీ ఉపయోగంలో ఉంది. ఈ యూరోపియన్ కంచు విగ్రహాలను ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చును. పౌరాణిక, చారిత్రక, సాహిత్య వ్యక్తుల విగ్రహాలు.
పౌరాణిక పాత్రల ఆధారంగా చేసిన వానిలో లావోకూస్, అతని ఇద్దరు కుమారులు ముఖ్యమైనవీ. ఇది క్రీ.పూ. రొడయాన్ శిల్పులు అనెనోడోరస్, పొలిడోరస్ చేసినది. వీరి కాలం స్పష్టంగా తెలియడం లేదు. పాము మత పెద్ద లావోకున్, అతని ఇద్దరు కుమారులను ఎలా పగ బట్టిందో చూడవచ్చు.
మెర్క్యురీ విశ్రాంతి అనేది క్రీ.పూ.3వ శ||కి చెందిన లిసిప్పస్కు ప్రతికృతి. ఈ శిల్పంలో జుపిటర్ యొక్క దూత అయిన మెర్క్యురి విశ్రాంతి తీసుకొన్నట్లు చెక్కబడింది. ఇది 1758లో హెర్యూలానియంలో దొరికింది. ఇందులో విషపూరితమైన అవయవాలతో కోపదృష్టులతో ఉన్న యువకుడైన మెర్క్యురీని శిల్పంగా చెక్కారు. శృంగారదేవత అయిన వీనస్‌ను మెడిసివీనస్ రూపాన్నిచ్చారు. దీన్ని ఎవరో అజ్ఞాత శిల్పి చెక్కారు.
ఇక చారిత్రక శిల్పాల విషయానికొస్తే, నికొలొ డా ఉజ్జానో బస్ట్ విగ్రహం ఉంది. 15వ శ||లో ఇటలీకి చెందిన ప్రఖ్యాత రినైసాన్స్ కాలపు శిల్పి అయిన డొనాటెల్లో శిల్పానికి అనుసరణ. పై రెండు విగ్రహాలు నిజానికి అపురూపశిల్పి మెకెలాంజిలో (1475-1560) మొదట పాలరాతితో చెక్కినవే. జ్యూల న్యాయదేవత యోజెస్ విగ్రహానికి నమూనా కంచుతో తయారైంది ఉంది ఇక్కడ. దీని అసలు విగ్రహం మెకెలాంజిలో అద్భుత సృష్టే.
మ్యూజియంలో కవుల, రచయితల విగ్రహాలున్నవి. ఇన్ఫెర్నో రచయిత డాంటే విగ్రహం, ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత షేక్స్పియర్ విగ్రహాలున్నవి. ఫ్రెంచి కవి లాపాంటేనే, రచయిత మోలియరే విగ్రహాలు కూడా ఉన్నవి. వీరిద్దరూ 17వ శ||కి చెందినవారే.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)