వెస్ట్రన్ బ్లాక్, మొదటి అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / వెస్ట్రన్ బ్లాక్, మొదటి అంతస్తు / యూరోపియన్ గడియారాలు
యూరోపియన్ గడియారాలు
యూరప్‌లోని అనేక దేశాల నుండి సేకరించిన ఎన్నో గడియారాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఫ్రాన్సు, ఇంగ్లాండు, స్విట్జర్లాండు, జర్మనీ, హోలెండ్ నుండే కాక అమెరికా నుంచి తెచ్చినవి కూడా ఉన్నవి. ఈ గడియారాల్లో పంజరపు గడియారం, బ్రాకెట్ గడియారం, గ్రాండ్ ఫాదర్ గడియారం, గొడుగు ఆకారపు గడియారం, బరామీటర్లు ముఖ్యమైనవి.
ఫ్రాన్స్‌కు చెందిన 14వ లూయీ కాలానికి చెందిన అద్భుతమైన గడియారాలు రెండున్నాయి. ఒకటి జూలియన్-లి-రాయ్‌కు (1686-1759) చెందినది. ఈయన ఫ్రాన్స్‌కు చెందిన 14వ లూయీ ఆస్థానంలో గడియారాల నిపుణుడు. ఫ్రాన్స్‌కు చెందిన ఒకటవ నెపోలియన్, 16వ లూయీ, 15వ లూయీ కాలానికి చెందిన అనేక గడియారాలు మ్యూజియంకే గర్వకారణమైనవి. ఇవన్నీ స్టాండులపై బిగించబడి అందమైన పూలు, లతల అలంకారాలు కలిగి ఉన్నాయి.
ఇక్కడ అందరూ అభిమానించేది, సందర్శకులను ఎక్కువగా ఆకర్షించేది బ్రిటిష్ తయారీ అయిన బ్రాకెట్ గడియారం. దీంట్లో ఉండే నిర్మాణ ప్రత్యేకతల వల్ల ఒక చిన్న బొమ్మ తన గది లోంచి గంటకోసారి బయటకి వచ్చి గంట కొట్టి తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది. దీని చుట్టూ ఎన్నో నగిషీలున్నవి. ఇంగ్లాండులో 18, 19 శ||లో ఇలాంటి గడియారాలు చాలా పేరుగాంచినవి.
బ్రాకెట్ క్లాక్, ఫ్రాన్స్, 18 వ శతాబ్దం (లూయిస్ XV కాలం)
హంటింగ్ లాడ్జ్ టేబుల్-పీస్, జర్మనీ, 19 వ శతాబ్దం
ఇత్తడి గడియారం, ఫ్రాన్స్, 19 వ శతాబ్దం