వెస్ట్రన్ బ్లాక్, క్రింది అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / వెస్ట్రన్ బ్లాక్, క్రింది అంతస్తు / యూరోపియన్ పాలరాతి శిల్పాలు
యూరోపియన్ పాలరాతి శిల్పాలు
మ్యూజియంలో ఉన్న శిల్పాలలో చాలా భాగం ఉద్యానవనాలలో అలంకరణ కోసం చెక్కినవే. ఇందులో చాలా భాగం గ్రీకు పౌరాణిక గాథల ఆధారంగా చెక్కినవే. మౌలికమైన శిల్పాలలో మొదటగా చెప్పుకోదగింది. ముసుగులో ఉన్న రెబెకాది. ఇది ఒకటవ సాలార్‌జంగ్ సేకరణ. ఈ రెబెకా అనే స్త్రీ నిజానికి ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఒక పాత్ర. ప్రపంచ ప్రఖ్యాత శిల్పి జి.బి.బెన్‌జోని రెబెకాలో యౌవనాన్ని, నునుసిగ్గు దొంతరలను చెక్కి శిల్పానికి ప్రాణమిచ్చాడు. మిగిలిన వాటిలో ప్రొ.బొరియోన్ చెక్కిన క్లియోపాత్ర, ఓ ఫ్రెంచి శిల్పి చెక్కిన బేబిలో అమాయకత్వం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. క్యూపిడ్ భార్య అయిన సైకి అనే అందగత్తె విగ్రహాలు ముఖ్యమైనవి. ప్రసిద్ధ ఫ్రెంచి శిల్పి కానొరా (1757-1822) చెక్కిన రెండు వీనస్ విగ్రహాలు చెప్పుకోదగినవి. మ్యూజియంలో ఇటలీ, ఫ్రాన్సు, ఇంగ్లాండుకు చెందిన అనేక పాలరాతి శిల్పాలున్నవి.