వెస్ట్రన్‌ బ్లాక్‌, మొదటి అంతస్తు

యూరోపియన్‌ చిత్రలేఖనాలు

యూరోపియన్‌ కళాసంపద అంటే ఆయిల్‌ మరియు వాటర్‌ పెయింటింగ్‌లు ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. శాస్త్రబద్ధంగాను, సౌందర్యాత్మకంగానూ ఇక్కడున్న వస్తువులు అత్యున్నత ప్రమాణలు కలిగినవి. ఇవి ఆ కాలపు ప్రజల, కళాకారుల అభిరుచులకు అద్దం పడతాయి. చాలా భాగం ప్రదర్శనాంశాలు 19 వ శ|| బ్రిటిష్‌ కాలానికి చెందినవైనా, సాంప్రదాయిక ఫ్రెంచి చిత్తరువులు ఉన్నాయి. ఇటలీకి చెందిన అందమైన ప్రకృతి దృశ్యాలు మ్యూనిచ్‌ చిత్రకారుల చిత్రాలూ కొలువుదీరాయి. మ్యూజియంలో ఉన్న కూపర్‌ యొక్క పశువులు, ఇంకో నాలుగు చిత్తరువులు ఆంగ్ల గ్రామీణ దృశ్యాలను, నిలువెత్తు ఆవులు, గొర్రెలను కళ్ళముందు నిలుపుతాయి. మ్యూజియంలో క్యానాలెట్టో, హెయిజ్‌ బ్లాస్‌, యార్క్‌ ల్డైన్‌, డిజియాని, మాట్టెని తో బాటు మరికొందరు ఇటాలియన్‌ చిత్రకారుల చిత్రాలున్నవి. కాన్‌లెట్టొ వేసిన ఆయిల్‌ పెయింటింగ్‌ పిజాసాన్‌ మార్కో అనేది మ్యూజియంలోని అత్యద్భుత చిత్రాలలో ఒకటి. ఇది అందమైన ఆర్కిటెక్చర్‌, ఆహ్లాదపరిచే రూపం, మనోహర ప్రకృతి దృశ్యం, అద్భుతమైన దృష్టికోణాల యొక్క సమ్మేళనం, హాయెజ్‌ యొక్క చిత్రంలో ఒక బాబు సబ్బుతో గాలి బుడగలను గాలిలోకి వదులుతున్నట్లున్న చిత్రం సందర్శకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది.