సెంట్రల్ బ్లాక్, క్రింది అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / సెంట్రల్ బ్లాక్, క్రింది అంతస్తు / భారతీయ శిల్పం
భారతీయ శిల్పం
ఈ మ్యూజియంలో విలువైన రాతిశిల్పాలు మన దేశానికి చెందినవి ఉన్నాయి. ప్రాచీన భారతీయ శిల్పాలలో వివిధ సంప్రదాయాలు కన్పిస్తుంటాయి. పూర్వం కొంత నైపుణ్యం పొందిన శిల్పులు మరింత నేర్చుకోవాలని ఇతర ప్రాంతాలకు వెళ్తుండేవారు. అక్కడి పద్ధతులనీ నేర్చుకునేవారు. అలా ఆ విజ్ఞానం ఓ తరం నుండి మరో తరానికి, తండ్రి నుండి కొడుక్కీ సంక్రమించేది. అంతేకాదు ఆనాడు ప్రతి సంప్రదాయానికి స్వంత బాణిలుండేవి. శిల్పకారులకు సంఘంలో ఉన్నత స్థానం ఉండేది.
భారతీయ శిల్ప విభాగంలో క్రీ.పూ.1వ శ|| నుండి క్రీ.శ.19వ శ|| వరకు విస్తరించిన 43 శిల్పాలున్నవి. ఇవి ఇసుకరాయి, నేట్, సున్నపురాయి, పాలరాయి మొ|| రాళ్ళతో తయారైనవి. ఈ విభాగంలో 24 హిందు మతానికి, 6 జైన మతానికి, 5 బౌద్ధ మతానికి చెందినవి. 7 అరుదైన షిస్ట్ అనే కఠినశిలపై చెక్కిన, గాంధార కాలపు 2 విగ్రహాలున్నవి.
కృష్ణానది ఒడ్డునున్న నాగార్జునకొండ దేశంలోని ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రాలలో ఒకటి. క్రీ.శ.2 శ||లలో ఇక్ష్వాకులు శాతవాహనులను ఓడించి, విజయపురి కేంద్రంగా ఆంధ్రదేశాన్ని పాలించారు. వారు బౌద్ధమతాన్ని ప్రోత్సహించారు. ఎన్నో శిల్పాలను చెక్కించారు. అందులో ప్రశస్తమైనవి రెండు ఇక్కడ ఉన్నాయి. వంకీల జుట్టుతో తిలకంతో ఉన్న ఇక్ష్వాకు బుద్ధ సున్నపురాయిది ఒకటి. నిలుచున్న బుద్ధ విగ్రహం రెండవది.

అనంతసయన విష్ణు, గ్రానైట్, కాకతీయ కాలం, 12 వ శతాబ్దం A.D.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)