సెంట్రల్ బ్లాక్, మొదటి అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / సెంట్రల్ బ్లాక్, మొదటి అంతస్తు / ఆటవస్తువులు, బొమ్మలు
భారతీయ వెండి వస్తువులు
వెండి విభాగంలో కరీంనగర్, కటక్ నుంచి ఫిలిగ్రీ వస్తువులున్నవి. వెండిని సన్నని తీగలుగా చేసి వాటితో అల్లిన సునిశిత డిజైన్ల వస్తువులున్నాయి. వీటిలో చెవిరింగులు, పతకాలు, ట్రేలు మొదలైన వస్తువులు ఎన్నో ఉన్నాయి.
భారతీయ కళాకారులు వెండితో వస్తువులను చేసేటప్పుడు అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శిస్తారు. ఈ నైపుణ్యానికి క్రీ.పూ.50కి చెందిన వెండి పటేరా గొప్ప ఉదాహరణ. ఇది ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్‌లో ఒక బౌద్ధ క్షేత్రాన్ని తవ్వుతున్న ఒక మేస్త్రీకి దొరికింది. కొన్నిసార్లు వెండి వస్తువులపై ఎనామిల్ మరియు బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. ఒడిషాలోని బొలంగీర్ జిల్లాకు చెందిన తర్బా ప్రాంతం సున్నితమైన నగిషీలున్న వెండి వస్తువులకు ప్రసిద్ధి. శ్రేష్ఠమైన, అందమైన వెండి వస్తువులనగానే కాశ్మీరు హక్కాలు గుర్తుకొస్తాయి. వీటిపై తామరలు, చీనార్లు, పాకే లతలు ఉండి కనువిందు కలిగిస్తాయి.
ఈ మ్యూజియంలో ఇవేగాక మసాలా డబ్బాలు, గులాబ్ పోష్లు (పన్నీరు చెంబులు), భరిణలు, హుక్కాలు, భోజనానికి వాడే పళ్ళాలు, గ్లాసులు, నీళ్ళకూజాలు ఉన్నాయి. ఇవన్నీ రాజస్థాన్‌లో సేకరించినవే. గుజరాత్‌లోని కచ్ ప్రాంతం అందమైన వెండి వస్తువులకు ప్రసిద్ధి. డిజైన్‌ను స్పష్టంగా చెక్కడం, విభిన్న ఆకారాలలో తయారు చేయడం వంటి ప్రత్యేకతలున్నందున ఇక్కడి వస్తువులను కచ్చికామ్ అని పిలుస్తారు.

వెండి పేటిక, 20 వ శతాబ్దం

వెండి ఫిలిగ్రీ వర్క్ ట్రే, కరీంనగర్, 19 వ శతాబ్దం
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)