సెంట్రల్ బ్లాక్, క్రింది అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / సెంట్రల్ బ్లాక్, క్రింది అంతస్తు / భారతీయ వస్త్ర పరిశ్రమ
భారతీయ వస్త్ర పరిశ్రమ
భారతీయ వస్త్ర సంప్రదాయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ప్రాచీన సింధులోయ నాగరికతలో దీని ప్రసక్తి కనిపిస్తుంది. మొహంజదారో తవ్వకాలలో పత్తి దొరికింది. ఈ విభాగంలో సందర్శకులకు వస్త్ర సంవిధానం యొక్క వైవిధ్యం పరిచయమవుతుంది. ఈ గ్యాలరీ వైవిధ్యభరిత వస్త్ర నమూనాలు, దుస్తులు, ఇతర వస్తువుల రూపంలో గడిచిన మూడు శతాబ్దాల వస్త్ర చరిత్రను కళ్ళముందు నిలుపుతుంది.
ప్రదర్శనలో నూలు, బ్రొకేడ్, మాశ్రు, మస్లిన్, పట్టు, వెల్వెట్, ఊలు వస్త్రాలున్నాయి. దుస్తులలో పగిడి, సఫా, చుగా, జామా, పట్కా, నడుం పట్టీలు, చీరలు, ఓణీలు, శాలువలు ఇక్కడ చూడవచ్చు.
మ్యూజియంలో 18, 19 శ|| అత్యుత్తమ కాశ్మీరీ శాలువలున్నాయి. ఇవి కాశ్మీరీల నైపుణ్యానికి తీపి గురుతులు. అంతేకాదు భారతదేశానికి ప్రపంచ గుర్తింపు తెచ్చిన కీర్తి పతాకలు. ఈ శాలువలు కాశ్మీరి నేత కార్మికుల సృజనాత్మకతకు, వర్ణ వైవిధ్యానికి, అల్లిక అందాలకు తీపి గుర్తులు. ఇక్కడ కన్పించే ప్రత్యేకమైన అల్లికను తురాంజ్ అల్లిక అంటారు. ఈ అల్లికతో ఇక్కడ నాలుగు శాలువలు ప్రదర్శనలో ఉన్నాయి.
మ్యూజియంలో బ్రొకేడ్ల సేకరణ ప్రత్యేకమైంది. విస్తారమైంది. ఇక్కడ చీరలు, దుపట్టాలు, ఓణీలు ఎన్నో ఉన్నవి. అనేక రకాల దుస్తులు కూడా ఉన్నవి. అతి విలువైన వాటిలో 19వ శ|| చెందిన మీనాకారి ఎంబ్రాయిడరీ ఉన్ని వెయిస్ట్ కోట్, మస్లిన్ చార్జామూ ఉన్నవి. జరీ ఎంబ్రాయిడరీ అంగరఖాలున్నవి. ఇవి సందర్శకుల చూపులను ఆకట్టుకుంటాయి.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)