సెంట్రల్ బ్లాక్, క్రింది అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / సెంట్రల్ బ్లాక్, క్రింది అంతస్తు / దంతపు శిల్పాలు
దంతపు శిల్పాలు
ఈ మ్యూజియంలో ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన అనేక దంతపు శిల్పాలున్నాయి. దంతపు బొమ్మల తయారీ కళాసాధనంగా ప్రముఖ స్థానం ఆక్రమించిందనడానికి ఇది స్పష్టమైన గురుతు. వీటిలో ఎక్కువ భాగం ఇటీవలివే అయినా ఇందులో అద్భుతమైన నైపుణ్యమూ, వారి తపనా స్పష్టంగా కనిపిస్తాయి.
సింధు నాగరికతా కాలం నుండి 20వ శ|| వరకు శిల్పులు నిరంతరంగా పాలరాతిని వారి కళాసాధనంగా, నైపుణ్యానికి చిహ్నంగా వాడారంటే దాని మన్నిక, సౌకుమార్యమే కారణాలు.
దంతం అంటే కేవలం ఏనుగుదంతమే అనుకుంటారు. వాల్రస్, నార్వల్, హిప్పొపొటమస్ల పళ్ళు కూడా ఈ కోవలోకే వస్తాయి. మన దేశంలో ఢిల్లీ, మైసూరు, విశాఖపట్టణం పాలరాతి శిల్పాల తయారీలో పేరెన్నికగన్నవి. ఈ శిల్పాల తయారీలో నాటి ప్రజల అభిరుచులు, ఆకాంక్షలు కొంతవరకు ప్రతిబింబిస్తాయి.
ఇక్కడి శిల్పాల సేకరణలో ఎంతో వైవిధ్యముంది. వీటిలో మనుష్యులు, పౌరాణిక పాత్రలు, జంతువులు, చదరంగం బల్లలు-పావులు, పేపర్ కట్టర్లు, ఫర్నీచర్, చిత్రలేఖనాలు ఇలా అనేక రకాలు. వీటిలో అతి విలువైనది, పండితుల నుంచి పామరుల దాకా అందరూ మెచ్చేది దంతపుచాప. దంతంతో దారాలను తయారు చేసి, పడుగుపేకగా అల్లింది. చూడగానే సందర్శకులు మంతమ్రుగ్ధులౌతారు. గ్యాలరీలో ఆసక్తికరమైన వాటిలో టిప్పు సుల్తాన్‌కు చెందిన రెండు కుర్చీలున్నవి. ఇవి అతనికి ఫ్రాన్స్‌కు చెందిన కింగ్ లూయిస్-16 ఇచ్చినవి.
చదరంగం పావులు, ఛాసర్ సెట్ చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ చదరంగం సెట్లో బంట్ల సైనికుల వలె, రాజు-రాణి ఏనుగు అంబారిపై కూర్చున్నట్లు ఉన్నారు. ఇవి 18, 19 శ|| మధ్య కాలంలో ఉత్తర భారతంలో తయారు చేసినవి.
మ్యూజియంలో కాగితాన్ని కత్తిరించే పేపరు కట్టర్లు చాలా ఉన్నాయి. ఇవి భారీ సైజులో, సున్నితమైన పనితనంతో మన కళ్ళను కట్టి పడేస్తాయి. ఒకదాని పిడి మీద ఏనుగు, దాని పొట్టలో ముగ్గురు మనుష్యులు ఉన్నట్లు చెక్కారు. ఇదంతా ఒక సైన్యాధికారి పెడస్టల్‌పై ఉన్నట్లు చెక్కి ఉంది. బ్లేడ్ మీద చెక్కిన డిజైన్‌లో అంచుల్లో లతలు, మధ్య భాగంలో పూలు, నక్షత్రాలు చెక్కారు. ఇది ఢిల్లీ నుంచి సేకరించింది. 19వ శ||కి చెందింది.
ఇంతేకాక మ్యూజియంలో ఊరేగింపు దృశ్యాలున్న అనేక కళాకృతులున్నాయి. సున్నితమైన పనితనంతో ఉన్న భరిణలు, జంతువులు, మంచం పక్కన వేసే చెక్క స్టూళ్ళు అనేకం ఉన్నాయి. దంతంపై సూక్ష్మ చిత్రాలు చెక్కిన వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఈ కళకు ఢిల్లీ ప్రసిద్ధి. చిత్రాలలో అంశాలు చాలావరకు మొఘల్, రాజస్థానీ, పహారీ సూక్ష్మ కళ నుండి స్ఫూర్తి పొందినవి.

ఐవరీ చెస్‌మెన్, 19 వ శతాబ్దం, యూరప్.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)