ఈస్ట్రన్ బ్లాక్, మొదటి అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / ఈస్ట్రన్ బ్లాక్, మొదటి అంతస్తు / జపనీస్ విభాగం
జపనీస్ విభాగం
చరిత్ర, సంస్కృతి రంగాలలో జపాన్, చైనాకు దగ్గరగా ఉన్నట్లు అన్పించినా, జపాన్ తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నది. వీటిలో పింగాణి, ఎనామిల్, దారువుతో చేసినవి, వాటర్ కలర్లతో పెయింటింగులు, సిల్కు వస్త్రాలున్నవి.
జపాన్ పింగాణీ వస్తువులు ఎక్కువగా తెలుపు, నీలం రంగులతో కనిపిస్తాయి. వీటిలో అరిటా, ఇమారి, హిరాడో, సెటో, కియోటో, సాత్సుమా రకాలున్నవి. 17వ శ||కి చెందిన అరిటా పోర్సిలీన్ వస్తువులు అతిప్రాచీనమైనవి.
ఇమారీ పోర్సిలీన్ వస్తువులు బరువుగా, గరుకుగా, గ్రే రంగులో చూడముచ్చటగా ఉంటాయి. ఈ గరుకుదనం నీలం, ఎరుపు రంగుల్లో దాగిపోతుంది. వెస్ట్రన్ హోండో లోని కాగా ప్రాంతంలో పోర్సిలీన్ రాతిని కనుగొన్నారు. 17వ శ|| మధ్య భాగంలో కుటాని అనేచోట ఒక ఫ్యాక్టరీ మొదలయ్యింది. ఇక్కడ ఈ కుటానీ రకం వస్తువులు చాలా ఉన్నాయి.
జపాన్ విభాగంలో ముఖ్యమైనవాటిలో దారు బ్లాకు ప్రింటులు ఒకటి. వీటిలో చక్కటి శిల్ప విన్యాసం ఉంది. ఈ కళ జపనీయుల ప్రత్యేక సంపద. ఇలా ఇక్కడ అనేక దారు శిల్పాలున్నవి. ప్రసిద్ధ శిల్పకారులు హిరోషిగే, కునియోసి వేసిన పెయింటింగులున్నాయి.
జపాన్ వారి సిల్క్, కాగితం మీద వేసిన వాటర్ కలర్ పెయింటింగ్లు సున్నిత వ్యక్తీకరణకు ప్రసిద్ధి. 19వ శ|| మధ్య భాగంలో షాజా స్కూల్కు చెందిన నిషియమా, హోమెస్ వేసిన రెండు చిత్రాలు ప్రత్యేకంగా చూడాల్సినవి.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)