సెంట్రల్ బ్లాక్, క్రింది అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / సెంట్రల్ బ్లాక్, క్రింది అంతస్తు / మసుగులో దాగిన రెబెకా (పాలరాతి శిల్పం)
మసుగులో దాగిన రెబెకా (పాలరాతి శిల్పం)
మార్బుల్ అనే మాట గ్రీకు పదం మారేమరోస్ నుండి వచ్చింది. గుండ్రాయి లేదా గండశిల అని ఈ మాటకు అర్థం. పాలరాతి రకాల్లో వెలుతురును ప్రసరింపజేసే రాయి శ్రేష్ఠమైందిగా ఎంచుతారు. ఇక్కడ గ్రీకు పురాణగాథలు అంశాలుగా, అద్భుతంగా చెక్కిన అనేక పాలరాతి శిల్పాలున్నాయి.
మ్యూజియానికే గర్వకారణమైన అపురూప సంపదల్లో ఒకటి స్వచ్ఛమైన పాలరాతి శిల్పం ముసుగులో ఉన్న రెబెకా. ఇది 1876లో మిలాన్‌కు చెందిన జి.బి.బెన్జోని చెక్కింది. ఇది నియోక్లాసికల్ కాలానికి చెందింది. అత్యున్నత శిల్ప లక్షణాలను పుణికి పుచ్చుకొన్నది. ఈమె మంచి అవయవ సౌష్ఠవంతో, మోహింపజేసే భంగిమలో నిలబడ్డ జ్యూయిష్ స్త్రీ ప్రతిరూపం. పైన పారదర్శకపు ముసుగు, లోన స్త్రీమూర్తి ఒకే శిలపై చెక్కింది. మొహంపై ముడతలు, వస్త్రాలలో ముడతలు, ఒంపుసొంపులు- అన్నీ కలిగిన ఓ అపూర్వ శిల్పానికి సజీవకళనిచ్చాయి. 1876లో సాలార్జంగ్-1 రోముకు వెళ్ళినప్పుడు దీనిని తీసుకొని వచ్చారు. దీన్ని అభిమానించేవారు దేశమంతా ఉన్నారు.